విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలెంటెడ్ నటి నిత్యా మేనన్తో (Nithya Menen) కలిసి నటించిన మూవీ ‘తలైవాన్ తలైవి’ (Thalaivan Thalaivi). తెలుగులో ‘సార్ మేడమ్’గా (Sir Madam) రిలీజ్ చేస్తున్నారు. పలు హిట్ చిత్రాలు తీసిన పాండిరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి ‘ఏస్’ ఈ మధ్యే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత నిత్యా మేనన్ నటిస్తున్న మూవీ ఇది. దీంతో చిత్రంపై భారీ ఆశలు నెలకొన్నాయి. మధ్య తరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యా మేనన్, విజయ్ సేతుపతి కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో జులై 25 రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ (Sir Madam Trailer) తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ను మీరూ చూసేయండి.






