Vidudhala Part 2 Twitter Talk | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనలను సిల్వర్ స్క్రీన్‌పై కండ్లకు కట్టినట్టు చూపించే అతికొద్ది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran). అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ప్రాంచైజీ ప్రాజెక్ట్‌లో వచ్చిన సీక్వెల్ విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2).
వెట్రిమారణ్ క్రాఫ్ట్, ఐడియాలజీ ఎప్పుడూ ప్రేక్షకులను నిరాశపరచదు. విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. సూరి లిమిటెడ్ సీన్స్‌లో కనిపించినా ఆకట్టుకున్నాడు. రాజీవ్ మీనన్, కెన్ కరుణాస్ రాకింగ్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. అద్భుతమైన, ఇంటెన్స్‌సాగే 30 నిమిషాల ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్. కొంచెం సాగదీతగా అనిపించినా.. అందమైన పాటలు, పవర్ ఫుల్ డైలాగ్స్, రా యాక్షన్ పార్ట్‌తో చూడదగిన సినిమా.
#ViduthalaiPart2 – VetriMaaran the filmmaker, who not only showcases the powerful scenes but also beautifully portrays the romantic sequence 🫶
One love scene between VijaySethupathi & ManjuWarrier…VJS the performer 🌟😍 pic.twitter.com/0gq5wPXh4X— AmuthaBharathi (@CinemaWithAB) December 20, 2024
ఫస్ట్ హాఫ్ యావరేజ్ నుంచి బాగుంది. బలమైన సన్నివేశాలు, బ్యాంగర్‌తో మొదలైంది. విజయ్‌సేతుపతి ఫ్లాష్‌బ్యాక్.. సమకాలనీ అంశాలతో సాగే సీన్లు 15 నిమిషాలపాటు ఉంటాయి. విప్లవాత్మక అంశాలను ఎక్కువగా చూపించడం వల్ల సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక విజయ్ సేతుపతి చాలా సన్నివేశాల్లో తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. మంజువారియర్, కెన్ కరుణాస్, కిశోర్ నటన బాగుంది. విజయ్ సేతుపతి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. వాథియార్ ఎదుగుదలకు కారణాలతో బలంగా చూపించబడ్డాయి. విరామ సమయానికి ఫస్ట్ హాఫ్ పోరాటం ప్రారంభం మాత్రమే.
వెట్రిమారన్ పవర్ ఫుల్ సన్నివేశాలను చూపించడమే కాకుండా రొమాంటిక్ సీక్వెన్స్‌ను కూడా అందంగా చూపించాడు. మక్కళ్ సెల్వన్, మంజువారియర్ మధ్య వచ్చే ఓ సన్నివేశం హైలెట్ అని చెప్పొచ్చు.






