“నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ, పార్టీ పదవులను వదులుకున్నాను.” అని సోషల్ మీడియా వేదికగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్ పై స్పందిస్తూ విజయసాయి రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు.
జగన్ కామెంట్స్.. విజయసాయి రెడ్డి రెస్పాన్స్
విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంపై ఇటీవల వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు. క్యారెక్టర్ ఉన్న వాళ్లే.. పార్టీలో ఉంటారంటూ పరోక్షంగా చురకలు అంటించారు. అయితే… జగన్ కామెంట్స్ తాజాగా విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన తనకు క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నాని కౌంటర్ ఇచ్చారు. విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025







