తంగలాన్ డిజాస్టర్ తర్వాత తమిళ్ స్టార్ హీరో విక్రమ్(Vikram) ప్రధానపాత్రలో నటించిన ‘వీర ధీర శూరన్(Veera Dheera Sooran)’. డైరెక్టర్ అరుణ్ కుమార్(Arun Kumar) తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. GV ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో దుషారా విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటించింది. విక్రమ్ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ OTT అప్డేట్ వచ్చేసింది.

ఐదు భాషల్లోనూ అందుబాటులోకి..
ఒకప్పుడు శివపుత్రుడు, అపరిచితుడు(Aparichitudu), మల్లన్న(Mallanna), నాన్న, ఐ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్‌కి సరైన హిట్ పడక చాలా కాలమైంది. అలాంటి విక్రమ్‌కి ఈ సినిమా ఫలితం కొంతవరకూ ఊరట కలిగించిందనే చెప్పాలి. తాజాగా ఆయన నటించిన వీర ధీర శూరన్(Veera Dheera Sooran) మూవీ తమిళ్‌లో మంచి సక్సెస్‌ను సాధించింది. అయితే తెలుగులో భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ ఏంటంటే..
కథ విషయానికి వస్తే .. “కాళీ (Vikram) తన భార్యాపిల్లలతో కలిసి హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. అతను చాలా సాఫ్ట్‌గా కనిపిస్తూ కిరాణాషాపు నడుపుతున్నప్పటికీ, ఆయన గతం వేరు. ఆ గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న అతని దగ్గరికి రవి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ అరుణగిరిని అంతం చేయమని కోరతాడు. అరుణగిరి ఎవరు? అతనితో రవికి గల శత్రుత్వం ఏమిటి? ఎందుకు అతను కాళీని ఆశ్రయిస్తాడు? అనేది మిగతా కథ.






