ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ (Ramakant Achrekar) మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా.. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar), అతని వద్దకు వచ్చి కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో కాంబ్లీ 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 21 ఇన్నింగ్స్ ల్లో 54.20 సగటుతో, 59.46 స్ట్రైక్ రేట్ 1084 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. టెస్టులో అతని అత్యధిక స్కోరు 227 పరుగులు. జనవరి 1993లో ఇంగ్లండ్ పై కాంబ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అక్టోబర్ 1991లో పాకిస్థాన్ పై వినోద్ కాంబ్లీ (Vinod Kambli) వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 105 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 97 ఇన్సింగ్స్ లతో 2477 పరుగులు చేశాడు. వన్డేల్లో కాంబ్లీ సగటు 32.59, స్ట్రైక్ రేట్ 71.94. ఈ ఫార్మాట్లో 14 అర్ధసెంచరీలతో పాటు 2 సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 106 పరుగులు చేశాడు. కాగా 1996 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, శ్రీలంక ఆడగా అందులో వినోద్ కాంబ్లీ ఫెయిల్ కావడంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటర్లు అందరూ తొందరగా అవుట్ కావడంతో ప్రేక్షకులు స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసి బాటిళ్లు విసిరేస్తారు. చైర్లకు నిప్పులు పెడతారు. దీంతో మ్యాచ్ రద్దవుతుంది. అనంతరం క్రికెట్ జట్టులోకి మళ్లీ సెలెక్ట్ కాకపోవడంతో వినోద్ కాంబ్లీ కెరీర్ ముగిసింది.
తాజాగా వినోద్ కాంబ్లీ వీడియో బయటకు రాాగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. కాగా ఆయన ఆరోగ్యం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా.. మరోసారి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఎలాంటి అధికారిక సమాచారం తెలపడం లేదు. కాంబ్లీ.. ఇటీవల పునరావాస కేంద్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మాజీ క్రికెటర్లు కూడా కాంబ్లీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కపిల్ దేవ్ (Kapil Dev) నుండి సునీల్ గవాస్కర్ వరకు అతనికి సహాయం చేయడం గురించి మాట్లాడారు.








