గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ ‘జూనియర్’ (Junior). తెలుగు బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్. డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి(Radhakrishna Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి జెనీలియా(Genelia)తదితరులు మెయిన్ రోల్స్ పోషించారు. దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) సంగీతం అందించారు. ఈ నెల 18న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ‘వైరల్ వయ్యారి’ (Viral Vayyari) సాంగ్ లిరికల్ వీడియోను మూవీ టీమ్ శుక్రవారం రిలీజ్ చేసింది. కల్యాణ్ చక్రవర్తి(Kalyan Chakravarthy) రాసిన ఈ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్, హరిప్రియ పాడారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్ చూశావంటే మైడ్ బ్లోయింగ్’ అంటూ హుషారెత్తిస్తున్న ఈ సాంగ్‌ను మీరూ చూసేయండి.






