Border-Gavaskar Trophy 2024-25: విరాట్​ సూపర్​ సెంచరీ.. ఇండియా డిక్లేర్డ్​

బోర్డర్​–గవాస్కర్​ ట్రోపీ (Border-Gavaskar Trophy) ఫస్ట్​ టెస్టులో భారత్​ భారీ ఆధిక్యం సాధించింది. ఓపెనర్​ యశస్వి జైస్వాల్​తోపాటు.. స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ (Virat Kohli) 16 నెలల తర్వాత సెంచరీ చేశాడు. కంగారూ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ అతడు 143 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్​లో 8 బౌండరీలతోపాటు 2 సిక్సులు ఉన్నాయి. విరాట్​ సెంచరీ పూర్తికాగానే.. 487 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి టీమ్​ఇండియా డిక్లేర్​ చేసింది. మొదటి ఇన్నింగ్స్​తో కలిపి భారత్​ మొత్తంగా 534 పరుగుల భారీ లీడ్​లో ఉంది.

172 ఓవర్​ నైట్​ స్కోర్​తో మూడోరోజు ఆట ప్రారంభించిన యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal​), కేఎల్​ రాహుల్​ అదే జోరు కొనసాగించారు. ఈ క్రమంలోనే జైస్వాల్​ తన కెరీర్​లో 4వ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో 16 పరుగులు జోడించి మిచెల్​ మార్ష్​ బౌలింగ్​లో స్టీవ్​ స్మిత్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. తాను నమోదు చేసిన మొదటి 4 సెంచరీలను కూడా 150 స్కోర్లుగా దాటించిన మొట్టమొదటి భారత బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. రాహుల్​ 77, పడిక్కల్​ 25 పరుగులు చేసి ఔటయ్యారు. కీపర్​ పంత్​, ధ్రువ్​ జురెల్​ రాణించలేదు. ఈ ఇద్దరూ చెరో పరుగు చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత వాషింగ్టన్​ సుందర్​ 29, తెలుగు కుర్రాడు నితిశ్​ కుమార్​ రెడ్డి(38 నాటౌట్)తో కలిసి ఆడిన విరాట్​ కోహ్లీ టెస్టు క్రికెట్​లో 30వ సెంచరీ నమోదు చేశాడు.

రికార్డ్​ సెంచరీ
విరాట్​ కెరీర్​లో ఇది ​81వ సెంచరీ. టెస్టుల్లో 30వ సెంచరీతో ఆస్ట్రేలియా గ్రేట్​ బ్రాడ్​మన్​ (29 సెంచరీలు)ను (Bradman) కోహ్లీ అధిగమించాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లికి ఇది ఏడో సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్ట్​ సృష్టించాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *