విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇది పేరు కాదు బ్రాండ్. తన క్రికెట్ మాయాజాలంతో భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 17 సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించిన కోహ్లీ.. గతంలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఈ ఏడాది మేలో టెస్ట్ క్రికెట్కు సైతం గుడ్బై చెప్పాడు. అయితే టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. ఎట్టకేలకు ఈ విషయంపై మాట్లాడారు. తన రిటైర్‌మెంట్‌కు నెరిసిన గడ్డంతో ముడిపెట్టాడు.
మన టైమ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి
మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) లండన్‌లో నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి హాజరైన కోహ్లీ రిటైర్‌మెంట్ గురించి మాట్లాడారు. తన వయసును ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే వయసు మీద పడుతోందనే అంశాన్ని నేరుగా చెప్పకుండా గడ్డానికి రంగు వేసుకుంటున్నానంటూ జోక్ చేశాడు. ‘గడ్డానికి రెండు రోజుల క్రితమే కలర్ వేశా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి కలర్ వేసుకుంటున్నామంటే మన టైమ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నాడు.
యువీ కోసమే వచ్చా..
నాడు యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌తో కలసి ఆడిన రోజుల్ని గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకునేందుకు వీరంతా సాయపడ్డారని తెలిపాడు. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా తాము చాలా క్లోజ్‌గా ఉంటామని పేర్కొన్నాడు. ‘టీమిండియాకు వచ్చిన కొత్తలో కాస్త భయం, బెరుకు ఉండేవి. కానీ యువీ, జహీర్, భజ్జీ నాకు అండగా నిలిచారు. యువరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఎంతో గౌరవిస్తా. యువీ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చా. మరొకరు పిలిస్తే వచ్చేవాడిని కాదు’ అని యువరాజ్ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
VIRAT KOHLI ON TEST RETIREMENT. 🗣️
“I just coloured my beard two days ago. You know it’s time when you are colouring your beard every four days”. pic.twitter.com/x8TgqU967X
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2025






