టీమ్ఇండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి బెంగళూరు నగరపాలిక అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు బెంగళూరులో కోహ్లీకి ‘వన్8 కమ్యూన్(One8 Commune)’ అనే పబ్ ఉంది. ఈ పబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనల(Fire Safety Regulations) ఉల్లంఘన జరిగిందంటూ బెంగళూరు బృహత్ మహానగర పాలిక (Bruhat Bengaluru Mahanagara Palike) నోటీసులు(Notice) ఇష్యూ చేసింది. నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి(MCA) సమీపంలో ఉన్న MG రోడ్డులోని రత్నం కాంప్లెక్స్‌లో ఈ పబ్ ఉంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(No Objection Certificate)’ తీసుకోకుండానే ఈ పబ్‌ను నిర్వహిస్తున్నారని BBMP పేర్కొంది.
గతంలోనూ ఓసారి నోటీసులు..
దీనిపై సామాజిక కార్యకర్తలు HM వెంకటేశ్, కుణిగల్ నరసింహమూర్తి అనే వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో BBMP ఈ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 29న నోటీసులు జారీ చేసింది. కానీ, ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశామని, 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే పబ్(PUB)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీకి చెందిన శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
అర్ధరాత్రి దాటాక పబ్ నిర్వహణ
కాగా, జులైలో కూడా ‘వన్8 కమ్యూన్’ పబ్‌పై ఒక కేసు నమోదయింది. అర్ధరాత్రి దాటాక 1 గంట వరకు నడిపించడంతో పోలీసులు FIR నమోదు చేశారు. అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా IPLలో కోహ్లీ బెంగళూరు ఫ్రాంచైజీ(RCB)కి చాలా ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ విరాట్ పబ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కోహ్లీ BGT 2024-25 కోసం ఆసీస్ పర్యటనలో ఉన్నాడు.
Virat Kohli's Bengaluru Pub One8 Commune Gets Civic Body Notice For Fire Safety Violations#viratkohli #one8commune #firesafety pic.twitter.com/8LQAoyIZTI
— Vibes of India (@vibesofindia_) December 21, 2024








