
ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన కొత్త రూపంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్(Stylish Look)తో కనిపించే కోహ్లీ, ఈసారి నెరిసిన మీసాలు, గడ్డం(Gray mustache and beard)తో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం లండన్(London)లో ఉంటున్న కింగ్.. తాజాగా తన మిత్రుడితో దిగిన పిక్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఈ మేకోవర్ అతని ఫిట్‌నెస్(Fitness), కొత్త హెయిర్‌స్టైల్(Hair Style)తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ మార్పు వెనుక కారణం ఏమిటన్నది ఇంకా రహస్యంగానే ఉంది. కోహ్లీ న్యూ లుక్‌పై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది ఓ బ్రాండ్ ప్రమోషన్(Promotion) కోసం కావచ్చంటున్నారు. ఇంకొందరు ఏదో సినిమా(Movie) లేదా వెబ్ సిరీస్(Web Series) ప్రాజెక్ట్ కోసమే అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు.
వన్డే రిటైర్మెంట్ లోడింగ్? అంటూ మీమ్స్
ఇక నెట్టింట”వన్డే రిటైర్మెంట్ లోడింగ్?” అంటూ నెటిజన్లు మీమ్స్(Memes), పోస్టులు షేర్ చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోహ్లీ ఓ కార్యక్రమంలో తన గడ్డం గురించి సరదాగా మాట్లాడుతూ “రెండు రోజుల క్రితమే గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు. అప్పుడు సరదాగా అన్న మాటలను ఇప్పుడు అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
కోహ్లీ శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, ఆయన తాజా రూపం మాత్రం రిటైర్మెంట్(Retirement)పై చర్చను మరింత పెంచింది. అయితే, తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన తదుపరి నిర్ణయం కోసం క్రికెట్ ప్రపంచం, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Virat Kohli with Shash Kiran in the UK. pic.twitter.com/Y9JoWrO1Gl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2025