
అమెరికా అధ్యక్షుడి(US President) రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో షాకిస్తున్నారు. దీంతో అటు అమెరికన్లతోపాటు ఇటు ప్రపంచ దేశాలు ట్రంప్‌పై మండిపడుతున్నాయి. సైన్యంలో మహిళల ప్రాధాన్యం రద్దు చేయడం, వీసా నిబంధనలు(Visa Rules) కఠినతరం చేయడం, అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపించడం సహా తాజాగా ప్రపంచ దేశాల దిగుమతులపై భారీ స్థాయిలో సుంకాలు(Tariffs) విధించడం వంటివి ఆయన ఒంట్టెద్దు పోకడకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా మరో కఠిన నిర్ణయంతో వార్తలు నిలిచారు ట్రంప్.. ఇంతకీ ఏమైందంటే..
సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా
సోషల్ మీడియా(Social Media) వేదికగా జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్టు తేలితే అలాంటి వారికి వీసాలు, గ్రీన్‌కార్డ్(Green Card) మంజూరు చేయవద్దని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్టూడెంట్ వీసాలు(Student Visa) మొదలుకొని గ్రీన్‌కార్డ్స్ దరఖాస్తుదారుల వరకూ అందరి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(US Citizenship and Immigration Services)ను ఆదేశించారు.
300 మంది వీసాలు క్యాన్సిల్
కాగా ఇలా తప్పుడు పోస్టులు పెట్టినా 300 మందికి గత నెలలో వీసాలు క్యాన్సిల్ చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో(Marco Rubio) వెల్లడించారు. ఇక ఉగ్రవాద సంస్థలుగా US వర్గీకరించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్‌బొల్లా, యెమెన్ హూతీల వంటి గ్రూపులకు మద్దతు ఇస్తే.. వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా భావిస్తామని, వారికి అనుకూలంగా పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.