శివభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కన్నప్ప’(Kannappa) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు(Vishnu Manchu) నిర్మించి ప్రధాన పాత్ర పోషించిన ఈ భారీ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్‌లాల్(Mohanlal), మోహన్ బాబు(Mahan Babu), అక్షయ్ కుమార్(Akhay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలవడంతో సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
వివిధ భాషల్లో ఇప్పటివరకు కన్నప్ప కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ఈసారి విష్ణు మరోసారి అదే కాన్సెప్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో వేసిన గ్రాండ్ సెట్స్, విజువల్ తో ఈ సినిమాకి మంచి ఫీల్ వచ్చింది. ఈ సినిమాలలో అయినా కొన్ని ప్లస్ లు, కొన్నిమైనస్ లు ఉంటాయి. అలాగే కన్నప్ప సినిమాలో కూడా కొన్ని ప్లస్ లు, కొన్నిమైనస్ లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.
కన్నప్ప సినిమా ప్లస్ పాయింట్లు:
స్టార్ కాస్ట్: ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, కాజల్, విష్ణులు ఉండటం ఈ సినిమాకి ప్లస్ అయితే.. భారీ తారాగణం ఈ సినిమాకి పెద్ద ప్లస్.
భక్తి భావన: శివభక్తి కాన్సెప్ట్‌ను అందంగా ప్రెజెంట్ చేయడం భక్తి సినిమాల అభిమానులకు నచ్చుతుంది.
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చాలా ఇంటెన్స్‌గా, భావోద్వేగంగా ఉండడం సినిమాకు బలంగా నిలిచింది.
క్లైమాక్స్: ఇతర కన్నప్ప సినిమాల్లో మాదిరిగానే క్లైమాక్స్ ఉండినా, ఇందులో మాత్రం మరింత గూస్‌బంప్స్ ఇచ్చేలా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విష్ణు నటన: ముఖ్యంగా చివరి గంటలో విష్ణు నటన సినిమాకి వెన్నెముకలా నిలిచింది.
ప్రభాస్ పాత్ర: రుద్ర రూపంలో ప్రభాస్ కనిపించడం అభిమానులకు పెద్ద ప్లస్.
బీజీఎం: నేపథ్య సంగీతం సినిమా ఎమోషన్‌ను మించిన స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రశంసిస్తున్నారు.
కన్నప్ప మూవీ మైనస్ పాయింట్లు:
వివాదాలు, ట్రోల్స్: షూటింగ్ మొదటి నుంచే సినిమాపై నెగెటివ్ ట్రోల్స్, వివాదాలు రావడం సినిమాపై మైనస్ ప్రభావం చూపింది.
ఫస్ట్ హాఫ్: కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఫస్ట్ హాఫ్ కొంచం బోరింగ్ గా అనిపించిందట.
లెంగ్త్: సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉందని.. కొంచం తగ్గించి ఉంటె బాగుండేది అంటున్నారు.
వీఎఫ్ఎక్స్: గ్రాఫిక్స్ కొంతవరకూ నిరాశపరిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
లోకేషన్లు: కొన్ని సన్నివేశాల్లోని లొకేషన్లు నాటురల్‌గా అనిపించలేదని కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.






