మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లైలా (Laila)’. రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్పులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
A MEGA EVENT LOADING 🔜
‘Mass Ka Das’ @VishwakSenActor & our producer @sahugarapati7 met MEGASTAR @KChiruTweets Garu and cordially invited him to the #Laila pre release event as the chief guest 🌟
More details soon! Stay tuned 💥#LailaTrailer TRENDING #1 on YouTube 🔥
▶️… pic.twitter.com/VpNC5LIlOW— Shine Screens (@Shine_Screens) February 7, 2025
ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ (Laila Movie Trailer) లో బిజీ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ధ్రువీకరించారు. మెగాస్టార్ ఇంటికి విశ్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి వెళ్లి ఆయణ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించారు.
కాంపౌండ్ మారిందేంటి?
అనంతరం విశ్వక్ చిరు (Chiranjeevi)ను గజమాలతో సత్కరించి ఆయనకు ఎంతో ఇష్టమైన హనుమాన్ విగ్రహాన్ని బహూకరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే విశ్వక్ సేన్ నందమూరి బాలకృష్ణకు చాలా దగ్గరన్న విషయం అందరికీ తెలిసిందే. బాలయ్యతో విశ్వక్ కు మంచి సాన్నిత్యం ఉంది. ఈ క్రమంలో ఈ వేడుక (Laila Pre Release Event)కు బాలయ్య చీఫ్ గెస్టుగా వస్తారని అంతా భావించారు. కానీ చివరకు చిరు ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు.
BOSS is BOSS!
I’m not a compound hero. There are 100 reasons to invite a hero for the event. Industry Andharam Okkate, compound lu levu.
– #VishwakSen at #Laila Trailer launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) February 6, 2025
నాకు తెలిసింది అదొక్కటే
ఇదే విషయాన్ని లైలా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విలేకర్లు విశ్వక్ సేన్ తో ప్రస్తావించగా ఆయన మీడియాకు కౌంటర్ ఇచ్చారు. నందమూరి (Balakrishna) కాంపౌడ్ నుంచి మెగా కాంపౌండ్ కు వచ్చారా అంటూ ఓ విలేకరి అడగగా.. విశ్వక్ తీవ్రంగా ఫైర్ అయ్యాడు. “కాంపౌండ్‌లు మీరు వేసుకుంటారు. నాకు తెలిసినది, ఉన్నది ఒకటే కాంపౌండ్. అది మా ఇంటి కాంపౌండ్. ఇండస్ట్రీలో మాత్రం అవేమీ లేవు. అంతా ఒకటే. బాస్ ఈజ్ బాస్. అనుబంధం ఉందని, ప్రతిసారి వాళ్లను పిలిచి ఇబ్బంది పెట్టలేం. దయచేసి మీరు గోడలు కట్టొద్దు.” అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.






