లేడీ గెటప్‌లో విశ్వక్‌సేన్ .. ‘లైలా’ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak sen‌) వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నాలుగైదు చిత్రాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి VS12. ‘లైలా (Laila)’ అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాతో రామ్ నారాయణ్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు.

వాలెంటైన్స్ రోజు వస్తున్న లైలా

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ (Vishwak Sen Laila First Look) ను రిలీజ్ చేయగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు (Valentines Day) సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

న్యూ ఇయర్ కు తొలి గులాబీ

ఇక మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ లో విశ్వక్ సేన్ (Vishwak Sen Laila Release Date) రెడ్ కలర్ డ్రెస్సులో కనిపించాడు, స్టైలిష్ గా.. గాగుల్స్ పెట్టుకుడి. డ్యూయల్ ప్యాంట్ తో ట్రెండీగా కనిపించాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ క్యారెక్టర్ చాలా డిఫరెంటుగా ఉంటుందని టాక్. లైలా తొలి గులాబి న్యూ ఇయర్ 2025కు రాబోతుంది. ఈ వాలెంటైన్స్ డేకు ఎంటర్‌టైనింగ్ బ్లాస్ట్‌ ఉండబోతుంది అంటూ పోస్టర్ కింద క్యాప్షన్ యాడ్ చేశారు మేకర్స్.

లేడీ గెటప్పులో విశ్వక్ సేన్

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్ గా నటిస్తోంది. తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నాడు. ఆయనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు లవర్ బాయ్ గా, మాస్ హీరోగా అలరించిన విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్పులో కనిపించబోతున్నాడు. దీంతో ఈ పాత్రలో ఎలా నటిస్తాడోనని ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *