విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా ‘లైలా (Laila)’. రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. ప్రేమికుల రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
నవ్వించడానికి బౌండరీల్లేవ్
ఇక ట్రైలర్ ఆద్యంతం ఫన్ గా సాగింది. నవ్వించడానికి రూల్స్ లేవు, బౌండరీలు లేవంటూ లైలా చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ (Laila Trailer) చూస్తే తెలుస్తోంది. ఈ ట్రైలర్ లో మొదట సోను మోడల్ గా విశ్వక్ సేన్ కనిపించారు. లోకల్ ఎమ్మెల్యే చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం సోను అంటూ.. అతన్ని చంపాలని పలువురు వెతుకుతుండటంతో వారి నుంచి తప్పించుకోవడం కోసం లేడీ గెటప్ వేసి లైలాగా మారతాడు విశ్వక్.
లైలా ప్రేమలో అబ్బాయిలు
ఇక అమ్మాయిలా లేడీ గెటప్ లో ఎంతో అందంగా ఉన్న లైలాను చూసి మగవాళ్లు లైన్ వేస్తుంటారు. కొంతమందైతే ప్రేమ పేరుతో వెంటపడుతుంటారు. ఈ క్రమంలో వచ్చే కామెడీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు బాగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ట్రైలర్ లో బూతే బూతు ఉన్నా.. ఆద్యంతం ఫన్ గా సాగడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.






