మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతున్న సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పుస్తకాన్ని ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఫొటోలు పంచుకుంది.
టీజర్ కాదు.. బుక్ రిలీజ్ మాత్రమే
‘‘విశ్వంభర’ ప్రపంచం మీ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలంటే వేచి ఉండండి’’ అని తెలిపింది. కొద్దిరోజులుగా కేన్స్ వేడుకల్లో విశ్వంభర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇందుకు భిన్నంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ బుక్ను (Vishwambhara Book) రిలీజ్ చేశారు.
13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచం
ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో విశ్వంభరలో చిరంజీవి కనిపించనున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.






