ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం(Vontimitta Kodandarama Kalyanam) కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, TTD ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందుభాగంలో VVIP గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు వేశారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు(Pattu Vastralu), ముత్యాల తలంబ్రాలు(Muthyala Thalambralu) సమర్పించారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలు, దేశవిదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Hon’ble Chief Minister offered Pattu Vastralu to Sri Sita Rama at Vontimitta, continuing the sacred tradition on behalf of the State for the divine Kalyanam. A gesture of faith and reverence.#vontimittakalyanam #ekashilanagaram #ontimitta #TTD #KodandaramaSwamy pic.twitter.com/5mmlE5WkFW
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 11, 2025
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
అంతకుముందు CM చంద్రబాబుకు ఆలయ వర్గాలు, TTD చైర్మన్ BR నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారుల స్వాగతం పలికారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. ఆలయ వేదపండితులు సీఎంకు తలపాగా చుట్టారు. సీతారాముల పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని చంద్రబాబు దంపతులు ఆలయ ప్రదక్షిణలు చేశారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు దంపతులకు అర్చక స్వాములు వేదాశీర్వచనం పలికి అక్షింతలు చల్లారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కూడిన చిత్రపటాన్ని సీఎం దంపతులకు బహూకరించారు. ఈ కార్యక్రమాలు ముగిశాక చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కోదండ రాముడి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు..
గత 5 ఏళ్లలో ఒక్కసారి అయినా జగన్ దంపతులు ఇలా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాడా?.. #Vontimitta #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/B4V7SFT9vh
— Sreenivas14C (@Sreenivas14C) April 11, 2025
23 భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు
కాగా శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి జరుగతున్న ఈ కళ్యాణాన్ని కార్యక్రామాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కళ్యాణం అనంతరం టీటీడీ అధికారులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.






