VRA’s Protest: వీఆర్ఏల ఆందోళన.. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ(Telangana)లో VRAల సమస్యలు పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దయెత్తున వీఆర్‌ఏలు ఆందోళనకు(Protests) దిగారు. దీంతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్స్ క్వార్టర్స్(Banjara Hills Ministers Quarters) వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ VRAలు మినిస్టర్స్‌ క్వార్టర్లను ముట్టడించారు. ఒక్కసారిగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన వీఆర్‌ఏలు మినిస్టర్‌ క్వార్టర్స్‌ను చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది.

మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణం

కాగా 61 సంవత్సరాలు పైబడిన VRAల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, 81, 85GOల ప్రకారం వారసులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని పలు డిమాండ్ల(Demands)తో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. అంతేగాక 3,797 మంది వీఆర్‌ఏలను విధుల్లోకి తీసుకోకపోగా.. తమ గోడు వెల్లబోసుకునేందుకు మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. జీవో ఇచ్చి 15 నెలలు గడుస్తున్న తమను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు, వీఆర్‌ఏల మధ్య తోపులాట

గత ప్రభుత్వంలో వీఆర్ఏల దీర్ఘకాలిక పోరాటం తర్వాత VRA JACతో చర్చలు జరిపి ప్రభుత్వం 81, 85 GOలను విడుదల చేసిందని తెలిపారు. అలాగే ఉద్యోగం రాక వీఆర్ఏల వారసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఒత్తిడితో 265 మంది మరణించారని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని వాపోయారు.ఈ సందర్భంగా పలువురు వీఆర్‌ఏలు బారికేడ్లను తోచుకొని ముందుకు పరుగులు తీశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ(baton charge) చేశారు. అయిన వీఆర్‌ఏలు వెనక్కి తగ్గలేదు. సుమారు గంటసేపు పోలీసులు వీఆర్‌ఏల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. చివరికి కొంతమంది వీఆర్‌ఏలను అరెస్ట్‌(Arrest) చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *