Barabar Premistha | బరాబర్ ప్రేమిస్తా టీజర్‌ లాంచ్‌

Barabar Premistha | రామ్‌ నగర్‌ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పాపులర్‌ టీవీ యాక్టర్‌ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (ChandraHass)‌. కాగా ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. చంద్రహాస్‌ నటిస్తోన్న కొత్త సినిమా బరాబర్‌ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ లాంచ్ చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే రుద్రారం అనే ఓ ఊళ్ళో జరిగే కథ అని, ఆ ఊళ్ళో అందరూ ప్రతిదానికి కొట్టుకుంటారని ఆ మధ్యలో హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ గా ఉండబోతుంది. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది.

తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని టీజర్‌ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్‌, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు టీజర్‌ చెబుతోంది. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్‌ మహి, మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ మీసాల, మధునందన్‌, అభయ్‌ నవీన్‌, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *