Mana Enadu: ప్రజెంట్ టీమ్ఇండియా(Team Inida) బిజీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు రోహిత్ సేన (Rohit Sharma) న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత భారత యంగ్ టీమ్ సౌతాఫ్రికా(South Africa) టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమ్ఇండియా నాలుగు మ్యాచుల T20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును కూడా బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) కెప్టెన్సీ చేయనున్నాడు.
అందుకే ఆ నిర్ణయం
ఇదిలా ఉండగా సౌతాఫ్రికా సిరీస్‌కు టీమ్ కోచింగ్ బాధ్యతలను మాజీ క్రికెటర్, ప్రస్తుత NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నేతృత్వంలో ఇదివరకు టీమ్ఇండియా చాలా మ్యాచులు ఆడింది. రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) కోసం ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో గౌతీ అటు సౌతాఫ్రికా, అటు ఆస్ట్రేలియా సిరీస్‌లను మేనేజ్ చేయలేడని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్‌లో భారత్ 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సినీయర్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తారు.
సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (C), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్.








