
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hritik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr. NTR) నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2(War2)’. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) డైరెక్ట్ చేశాడు. కియారా అద్వానీ(Kiara Advani) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనిల్ కపూర్(Anil Kapoor), అషుతోష్ రాణా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ ఆగస్టు 14న విడుదల కాబోతోన్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. RRR, దేవర(Devara)తో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాడు. అటు హృతిక్ కూడా ఈ మూవీతోనే ప్యాన్ ఇండియా మార్కెట్లోకి వస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్‌లో భాగంగా రూపొందుతోన్న ఈ మూవీ తెలుగు రైట్స్‌ను నాగవంశీ(Nagavamsi) తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన చిత్రం ఇదే
ఇప్పటి వరకూ ఇండియాలో అత్యంత ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమా ‘రోబో2.0’. శంకర్, రజినీకాంత్ కాంబోలో ఆల్రెడీ వచ్చిన రోబో(Robo) బ్లాక్‌బస్టర్ కావడం.. తర్వాత దానికి సీక్వెల్ లా ఇది కనిపించడంతో అప్పట్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఏకంగా 7500 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. బట్ ఆ రేంజ్‌కు తగ్గ రిజల్ట్ అయితే రాలేదు. అయినా అదో రికార్డ్. ఆ రికార్డ్‌నే వార్ 2తో బద్ధలు కొట్టే ప్లాన్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఉంది.
War2 Mania — 14th Aug 2025 pic.twitter.com/KHRPM3TiVE
— Antu Sikder (@antusikder3007) July 12, 2025
వార్ 2తో రజినీకాంత్ కూలీ ఢీ
వార్ 2 చిత్రాన్ని 9 వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయట. కాకపోతే వార్ 2 రిలీజ్ రోజునే అదే సూపర్ స్టార్ నటించిన కూలీ(Cooli) చిత్రం విడుదలవుతోంది. ఇందులో భారీ తారాగణం ఉంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) డైరెక్టర్ కావడంతో అంచనాలూ పీక్స్‌లో ఉన్నాయి. 7,500 స్క్రీన్స్ రికార్డ్ ను బద్ధలు కొట్టడం అంత సులువేం కాదు. అదే టైమ్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను తక్కువ అంచనా వేయడానికీ లేదు.