జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో పాటు దేవర మూవీతో కూడా బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలోనే సెకండ్ హీరోగా నటిస్తున్నారు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మెయిన్ రోల్ చేస్తుండగా.. ఎన్టీఆర్(Jr. NTR) మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో ‘డ్రాగన్(Dragon)’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు దేవర -2లో బిజీగా ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులకు రాబోయే రోజులు పండగే అనుకుంటున్నారు.
నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ
అటు బాలీవుడ్ మూవీలో డైరెక్టుగా యాక్ట్ చేస్తుండటంతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇటు సౌత్ ఇండియా, తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్‌లో నేరుగా ఫ్యాన్స్‌ను సంపాదించుకునే పనిలో ఎన్టీఆర్ పడిపోయారు. కాగా వార్ 2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Hrithik Roshan Teases ‘War 2’ Surprise for Jr NTR’s Birthday, Sparks Fan Frenzy
Read More: https://t.co/MI2DLXA1NL#War2 #HrithikRoshan #JrNTR #KiaraAdvani #YRFSpyUniverse #War2Update #Bollywood #Tollywood #NTRBirthday #AyanMukerji #War2Release #NewsLive
— NEWS LIVE (@NewsLiveGhy) May 16, 2025
సర్‌ప్రైజ్ మామూలుగా ఉండదు
‘మీకు తెలియదు. మేం ఒక సర్‌ప్రైజ్ గిప్ట్ (Surprise gift) ఇవ్వబోతున్నాం.. మే 20న అందరూ సిద్ధంగా ఉండండి..’’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మే 20 ఎందుకని అభిమానులు ఆలోచించగా.. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. దీని కోసం వార్ 2 టీం స్పెషల్ గా ఏదో చేయబోతుందని తెలుస్తోంది. సినిమా టీజర్ విడుదల చేస్తారా.. లేక అంతకుమించి ఏదైనా ప్లాన్ చేశారా అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు మీరు ఊహించనంత స్పెషల్‌గా ఉండబోతుందీ మే 20 అంటూ హృతిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025






