బంతి(Ball)కి బ్యాట్(Bat)కు మధ్య హోరాహోరీ పోరు.. ఓ చోట పేస్(pace) బౌలింగ్‌తో ఇబ్బంది పెడితే.. మరోచోట గింగిరాలు తిరిగే(Spin) బంతులతో బ్యాటర్లను ఓ ఆట ఆడుకుంటారు.. అంతకు మించి ఫీల్డ్‌లో బాల్-బ్యాట్‌కు జరిగే పోరుకంటే.. ప్రత్యర్థుల మధ్య పేలే మాటల తూటాలే ఎక్కువ. మాటకు మాట. దెబ్బకు దెబ్బ.. కేవలం ప్లేయర్లే కాదు.. అభిమానులూ అంతే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా దేనిగురించి మాట్లాడుతున్నామో.. అదేనండీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) గురించే. టెస్ట్ క్రికెట్లో యాసెష్(Ashes Trophy) తర్వాత అంతటి ప్రాధన్యత సిరీస్ ఏదంటే అందరూ చెప్పేది ఈ సిరీస్ గురించే. ఇంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించే ఈ సిరీస్.. అసలు ఎలా ప్రారంభమైంది? దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
బీజీటీ అలా మొదలైంది..
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) 1996లో మొదలైంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా(Australia) ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే ఇటు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), ఆసీస్ ఆటగాడు అలెన్ బోర్డర్(Allen Border) పేరిట ఒక సిరీస్ జరిపితే బాగుంటుందని ఇరుదేశాల బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఆలస్యం చేయడం ఎందుకని ఆ ఏకైక టెస్టుకు ‘బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ’గా నామకరణం చేశారు. తొలిసారి జరిగిన ఈ సిరీస్‌ను IND దక్కించుకుంది. అలా మొదలైన ఈ సిరీస్ విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది. బోర్డర్,గవాస్కర్ టెస్టు క్రికెట్లో తమ జట్లకు విశేష సేవలందించారు. టెస్టుల్లో 10వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు. వీరి గౌరవార్థం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌కు బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు.
ఎవరి సొంతగడ్డపై వారిదే పైచేయి
కాగా ఈసిరీస్‌లో ఎవరి సొంతగడ్డపై నిర్వహిస్తే వారు పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. అయితే భారత్ 2017 నుంచి కంగారూ గడ్డపై సత్తాచాటుతోంది. ఇప్పటి వరకూ BGTలో భాగంగా భారత గడ్డపై 29 మ్యాచ్‌లు జరగ్గా, అందులో IND 18 విజయాలు సాధించింది. AUS 6 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఆస్ట్రేలియాలో 27 మ్యాచ్‌లు జరగ్గా, ఆసీస్ 14 సార్లు నెగ్గింది. IND ఆరింట్లో గెలిచింది. 7మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కాగా, 1996లో ప్రారంభమైన ట్రోఫీలో టీమ్ఇండియానే పైచేయి సాధించింది. ఇప్పటివరకూ ఈ ట్రోఫీని 16 సార్లు నిర్వహించారు. అందులో 10సార్లు భారత్ విజేతగా నిలిచింది. 5సార్లు ఆసీస్ ట్రోఫీని గెలుచుకుంది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఈ ఏడాది ఈ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
BGT Classics : Australia's Fielding masterclass in Adelaide 2008[Thread]
After an incredible win at WACA, India came to Adelaide in the hopes of squaring the series. Sachin's 153 took them to 526 but 100s from Hayden and Ponting meant they were fighting to save the game on day 5 pic.twitter.com/hmRICSpB9b
— Aman Patel (@lilbrownykid) November 7, 2024






