Mana Enadu: పుణే(Pune) వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్‌లో ఓటమిపై టీమ్ఇండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తాజాగా స్పందించారు. ఆ మ్యాచ్‌లో తాము ఒత్తిడి(Pressure)ని ఎదుర్కోలేక ఓటమిపాలైనట్టు రోహిత్ తెలిపారు. రెండో టెస్టులో భారత్ 113 రన్స్ తేడాతో పరాజయం మూటగట్టుకుంది. దీంతో 2012 తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ గత 12 ఏళ్లుగా ఈ ఒక్క టెస్ట్ సిరీస్ మాత్రమే కోల్పోయామని, కానీ 18 టెస్ట్ సిరీస్‌లను గెలిచిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఎవరినీ తక్కువ అంచనా వేయట్లేదు
రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సరిగా బ్యాటింగ్ చేయలేదని, పిచ్(Pitch) అంత పేలవంగా ఏమీ లేదు, కానీ న్యూజిలాండ్ సాధించిన స్కోరు చేరుకోలేకపోయామని రోహిత్ అన్నాడు. ఇక సిరీస్(Series)ను కోల్పోవడంపై స్పందిస్తూ ఈ సిరీస్‌ను కోల్పోవడానికి ముందు తాము 18 సిరీస్‌లు గెలిచామని రోహిత్ గుర్తుచేశాడు. చాలా విషయాల్లో బాగానే రాణించామని,కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతూనే ఉంటాయన్నాడు. జట్టులోని ఎవరి సామర్థ్యాన్నీ తాను అనుమానించడం లేదన్నాడు రోహిత్.
మూడో టెస్టులోనూ తడబాటు
ఇదిలా ఉండగా ముంబై(Mumbai Test)తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. పంత్ (60) చేసి ఔట్ అయ్యాడు. గిల్ (65*)కి తోడు జడేజా క్రీజులో ఉన్నాడు. భారత్ ఇంకా 55 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ టెస్టులోనూ కెప్టెన్ రోహిత్ శర్మ (18)నిరాశపర్చాడు. కోహ్లీ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ టెస్టులో భారత్ గెలవకపోతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(World Test Championship Final) చేరడం అంత సులభం కాదు.








