
ఈ డిజిటల్ యుగంలో ప్రతి స్మార్ట్‌ఫోన్(Smart Phone)లో తప్పనిసరిగా ఉండే అప్లికేషన్(Applications)లలో వాట్సాప్ ఒకటి. చాలామంది దీన్ని కేవలం మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం, ఫొటోలు షేర్ చేయడం వంటి సాధారణ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, అదే వాట్సాప్(WhatsApp)ను సృజనాత్మకంగా ఉపయోగిస్తే, అది ఆదాయ మార్గంగా కూడా మారుతుంది. అదెలాగో చూద్దాం.
* వాట్సాప్ బిజినెస్ యాప్
చిన్న వ్యాపారాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ బిజినెస్ యాప్ అనేక ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది. ఇందులో బిజినెస్ ప్రొఫైల్, ఉత్పత్తుల కేటలాగ్, ఆటో రిప్లై మెసేజ్‌లు, లేబుల్స్ వంటి ఫీచర్‌లను ఉపయోగించి కస్టమర్‌లను నేరుగా కనెక్ట్ అవ్వవచ్చు. ఈ ఫీచర్ల ద్వారా బట్టలు, ఆభరణాలు, ఇంటి వంటకాలు లేదా ఇతర ఉత్పత్తులను విక్రయించవచ్చు. ఇంకా, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లింపులు స్వీకరించడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, హోం బిజినెస్‌లు చేసేవారికి ఇది ఓ బూస్ట్‌గా మారుతుంది.
* వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులు
మీకు ఏదైనా నైపుణ్యం (ఫిట్‌నెస్, స్టాక్ మార్కెట్, ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్) ఉంటే, మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కోర్సులు నిర్వహించవచ్చు. చాలామంది నిపుణులు 99 నుంచి 499 రూపాయల ఫీజుతో ఇలా కోర్సులు నిర్వహిస్తూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
* డిజిటల్ సేవల ద్వారా డబ్బు
మీకు డిజైనింగ్‌పై ఆసక్తి ఉంటే డిజిటల్ పోస్టర్లు, పుట్టినరోజు కార్డులు, వెడ్డింగ్ ఇన్విటేషన్లు, వీడియో ఎడిటింగ్ వంటి చిన్న సేవలను వాట్సాప్ ద్వారా ప్రమోట్ చేయవచ్చు. కస్టమర్ల అవసరాలను తెలుసుకుని కస్టమైజ్డ్ సేవలు అందించడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు.
గమనిక: పై సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే పబ్లిక్ డేటా ఆధారంగా అందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎటువంటి ఆర్థిక చర్య తీసుకోవడానికి ముందు సొంత పరిశీలన చేయాలని సూచించబడుతుంది.