ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను (New Feature) అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా మెటా సంస్థ వాట్సాప్ స్టేటస్(WhatsApp Status) విభాగంలో నాలుగు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. వీటిలో బిల్ట్-ఇన్ ఎడిటర్ ఆప్షన్ ఒక ముఖ్యమైన అంశం. ఈ ఫీచర్ యూజర్లకు స్టేటస్ అప్‌డేట్‌లను మరింత సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా మార్చే అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త లేఅవుట్ ఆప్షన్ ద్వారా యూజర్లు ఒకేసారి ఆరు ఫొటోలను ఎంచుకొని, వాటిని కొలాజ్ రూపం(Collage form)లో అమర్చవచ్చు. ఈ ఎడిటర్ సాధనం ఇన్‌స్టాగ్రామ్(Instagram)లోని స్టోరీల ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇది ట్రిప్ హైలైట్స్, ఈవెంట్ జ్ఞాపకాలు లేదా రోజువారీ క్షణాలను షేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

స్టేటస్‌లో ఆడియో-విజువల్‌గా పోస్ట్
ఈ బిల్ట్-ఇన్ ఎడిటర్(Built-in editor)తో పాటు, వాట్సాప్ ఫొటో స్టిక్కర్‌లు, మ్యూజిక్ స్టిక్కర్‌లతోపాటు”Add Yours” ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ఫొటో స్టిక్కర్ టూల్ ద్వారా యూజర్లు ఏదైనా ఇమేజ్‌ను కస్టమైజ్డ్ స్టిక్కర్‌గా మార్చవచ్చు. దాన్ని క్రాప్ చేయవచ్చు. రీసైజ్ చేయవచ్చు లేదా ఆకారం మార్చవచ్చు. మ్యూజిక్ స్టిక్కర్‌లు ఫొటో లేదా సెల్ఫీపై ఇష్టమైన పాటను ఓవర్‌లే చేయడానికి అనుమతిస్తాయి. ఇది స్టేటస్‌ను ఆడియో-విజువల్ పోస్ట్(Audio-visual post)గా మారుస్తుంది.

త్వరలో అందరికి అందుబాటులోకి
“Add Yours” ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్(Facebook)లోని ఇంటరాక్టివ్ ఫార్మాట్‌ను అనుసరిస్తూ, యూజర్లు “బెస్ట్ కాఫీ మూమెంట్” లేదా “త్రోబాక్ పిక్” వంటి ప్రాంప్ట్‌లను పోస్ట్ చేసి, స్నేహితులను వారి సొంత ఫొటోలు లేదా వీడియోలతో స్పందించమని ఆహ్వానించవచ్చు. మెటా(Meta) ప్రకారం, ఈ ఫీచర్లు రాబోయే నెలల్లో దశలవారీగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ అప్‌డేట్‌లు వాట్సాప్‌ను మరింత ఇంటరాక్టివ్, మార్చడం ద్వారా యూజర్(Users) ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచనున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పటికే కొందరికీ అందుబాటులోకి రాగా.. మిగిలిన వారికి త్వరలో రానుంది.
This is the first look at WhatsApp’s new “username” feature. You can share a username instead of your number. A 4-digit code will be used for first-time contacts to prevent spam. pic.twitter.com/FEbA9r5Eri
— Albaraa Abdelhadi Elhag (@Albaraa_Elhag) August 9, 2025






