తెలుగు చిత్రసీమలో విభిన్న కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ(Krishna Vamshi) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. 2002లో ఆయన రూపొందించిన ఖడ్గం(Khadgam) చిత్రం కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ ముగ్గురు నటుల ఉత్తమ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాకు కథను కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ కలిసి అందించగా, సంగీతాన్ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఫిల్మ్ మ్యూజిక్ అభిమానులకు ఎంతో గుర్తుండిపోయే ఈ ఆల్బమ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే నటించింది. వీరి మధ్య కనిపించే లవ్ ట్రాక్ చిన్నదైనా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రే(Sonali Bindre) పాత్రకు డబ్బింగ్ ఇచ్చింది సీనియర్ నటి రమ్యకృష్ణ. చాలా సినిమాల్లో నటీమణుల పాత్రలకు ఇతర నటులు వాయిస్ ఇవ్వడం సాధారణమే. ఖడ్గం సినిమాలో కూడా అలాంటి సీన్ ఒకటి చోటుచేసుకుంది. రమ్యకృష్ణ తన గొంతుతో సోనాలి పాత్రకు జీవం పోసారు.
ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, రమ్యకృష్ణ కేవలం ఒక గొప్ప నటి మాత్రమే కాదు, డైరెక్టర్ కృష్ణవంశీ సతీమణి కూడా. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఖడ్గం చిత్రానికి మరింత బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం రమ్యకృష్ణ సహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో ఆయన తల్లి పాత్రలో కనిపించి విశేషంగా మెప్పించారు.






