US Elections: అగ్రరాజ్యంలో నేడే అధ్యక్ష ఎన్నికలు.. వైట్‌హౌస్ పీటం దక్కేదెవరికో!

ManaEnadu: అగ్రరాజ్యం అమెరికా(Amarica)లో ఎన్నికలకు వేళైంది. వైట్ హౌస్‌(WhiteHouse) పీఠం కోసం జరిగే అధ్యక్ష ఎన్నికలకు(President Elections) నేడు పోలింగ్(Polling) జరగనుంది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Democratic candidate Kamala Harris), రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Republican Donald Trump)తో పోటీపడుతున్నారు. కాగా అమెరికాలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఇందులో ఇప్పటికే 7.5 కోట్ల మంది ముందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్‌లో ముందుంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 48 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు.

 ఆ రాష్ట్రాల్లో హోరాహోరీ తప్పదా?

అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్‌(Electoral Votes) ఓట్లున్నాయి. గెలవడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 270 ఓట్లు అయితే సేఫ్‌ స్టేట్లన్నీ ఈసారి కూడా ఆయా పార్టీల ఖాతాల్లోనే పడే అవకాశం ఉండడంతో ఆ లెక్కన కమలా హారిస్‌కు 226 ఓట్లు సాధించే అవకాశం ఉంది.. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే దక్కే ఛాన్సుంది. దీంతో స్వింగ్‌ స్టేట్లలోని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్‌ గెలవాలంటే ఆ 93లో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు సరిపోతాయి. అలాగే 19 ఎలక్టోరల్‌ ఓట్లున్న పెన్సిల్వేనియా (Pennsylvania) ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశం 90 శాతం వరకూ ఉండడంతో పెన్సిల్వేనియాలో హారిస్, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

అమెరికా ఎన్నికల గురించి కొన్ని కీలక విషయాలు

☛ ప్రతిసారి నవంబర్ తొలి మంగళవారంలో ఎన్నికలు నిర్వహిస్తారు.
☛ భారత కాలమానం(IST) ప్రకారం NOV 5వ తేదీ మంగళవారం సాయంత్రం 4.30 నుంచి పోలింగ్ జరుగుతుంది.
☛ అమెరికాలో మొత్తం ఓటర్లు 24.4 కోట్లు.
☛ ఎర్లీ ఓటింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 7.5 కోట్లు.
☛ ఇంగ్లిష్-చైనీస్-స్పానిష్-కొరియన్-బెంగాలి భాషల్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది.
☛ మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
☛ 538 ఎలక్టోరల్ కాలేజ్(Electoral College) ఓట్లలో 270 ఓట్లు సాధించిన వారే విజేత.
☛ గెలిచిన వారు కొత్త అధ్యక్షుడిగా 2025 JAN 20న ప్రమాణస్వీకారం చేస్తారు.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *