టీమ్ఇండియా(Team India) టెస్టు జట్టుకోసం కొత్త సారథి(New Captain) కోసం వేట ప్రారంభించింది. ముఖ్యంగా న్యూజిలాండ్(NZ)పై సొంతగడ్డపై ఓటమి.. ఆస్ట్రేలియా(AUS)తో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో ఘోర పరాజయం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ బాల్ ఫార్మాట్లో(Test Cricket) హిట్ మ్యాన్ వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది. రోహిత్ ఇప్పటికే T20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఇటీవల అతడి రిటైర్మెంట్(Retirement)పైనా వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, ఆ తర్వాత అతడు మనసు మార్చుకున్నాడని, మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగుతాడని వార్తలు వచ్చాయి.
బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాలు
ఇదిలా ఉండగా తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్(Gmabhir), చీఫ్ సెలక్టెర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar), BCCI పెద్దలు మీటింగ్ నిర్వహించారు. BGTలో ఓటమి తీరుపై విశ్లేషించారు. అదే సమయంలో టెస్టుల్లో జట్టుకి కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అందులోభాగంగా వైస్ కెప్టెన్ బుమ్రా(Vice Captain Bumrah) పేరు మొదటి వరుసలో ఉండగా, రిషభ్ పంత్(Rishbh Pant) పేర్లు మొదట తెరమీదకు వచ్చినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే, అతడి ఫిట్‌నెస్(Fitness) చుట్టూ సందేహాలు నెలకొనడంతో అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సెలక్టర్లు ఆలోచిస్తున్నారు.
కోచ్ జైస్వాల్ వైపు.. సెలక్టర్ పంత్ వైపు
మరోవైపు, యువ ఆటగాడు జైస్వాల్(Jaiswal) పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కెప్టెన్‌గా అతడైతే బాగుంటుందని కోచ్ గంభీర్ భావిస్తున్నాడట. అయితే, జైస్వాల్ ఇంకా కెరియర్ తొలి దశలోనే ఉండటంతో అతడిని ఎంపిక చేస్తే విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం రిషభ్‌పంత్(Pant) వైపు మొగ్గు చూపుతున్నాడు. పంత్‌కు కెప్టెన్సీ సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మరీ దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యతే లేనట్టు ఆడతాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకుంటారా? లేదంటే మరో ఆటగాడిని తెరపైకి తీసుకొస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.









