న్యూ ఇయర్ మొదలైంది. ఇక అన్ని క్రీడల్లోనూ న్యూ షెడ్యూల్ వచ్చేసింది. ముఖ్యంగా ఇందులో టెన్నిస్(Tennis)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతెందుకు క్రికెట్ గాడ్‌గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) దగ్గర నుంచి రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) వరకూ చాలా మంది ఇతర ప్లేయర్లూ టెన్నిస్ క్రీడకు అభిమానులే. తాజగా ఈ ఏడాది టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2025)తో మొదలు కానుంది. నేటి నుంచి (జనవరి 12) మెల్‌బోర్న్(Melbourne) వేదికగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభమవనుంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు.
జొకో చరిత్ర సృష్టిస్తాడా?
ఇక ఈ గ్రాండ్‌స్లామ్(Grand Slam) గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జొకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్(Margaret Court)తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న 37 ఏళ్ల జొకో.. కొత్త కోచ్ ఆండీ ముర్రే(Andy Murray)తో ఈ టోర్నీకి సిద్ధమయ్యాడు. ఇక ప్రపంచ నంబర్‌వన్ సినర్ (Italy), అల్కరాస్ (Spain) టైటిల్‌కు బలమైన పోటీదారులుగా ఉన్నారు. ముఖ్యంగా 21 ఏళ్ల సినర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు.
మహిళ సింగిల్స్‌లో ఆ ముగ్గురి మధ్యే పోటీ
గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్, ATP ఫైనల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్, ఫ్రిట్జ్ (US), మెద్వెదెవ్ (రష్యా), రూడ్ (నార్వే) కూడా గట్టిపోటీదారులే. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరియానా సబలెంక (Belarus), స్లోన్ స్టీఫెన్స్ (US), ఇగా స్వైటెక్ (Poland) మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఈ ముగ్గురు ఎలా ఆడుతారో చూడాలి. ఇదిలా ఉండగా నిన్నటి నుంచి మెల్‌బోర్న్‌లో వర్షం కురుస్తోంది.
It only took a matter of hours for Melbourne to produce rain for the Australian Open. ☔️
BLOG | https://t.co/rAh4KkX07z pic.twitter.com/X9r3LoZLml
— The Advertiser Sport (@TheTiserSport) January 12, 2025






