ManaEnadu: అందమైనది.. అద్భుతమైనది. మళ్లీ రానిది. అందరూ మళ్లీ మళ్లీ కావాలనుకునేది బాల్యం(childhood). బోసి నవ్వుల బుజ్జాయిలే రేపటి నవ భారత నిర్మాతలు(Producers of New India). పైగా భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే.. మనలో చాలామంది తమ బాల్యం తిరిగి ఇవ్వమని అడుగుతామంటారు. భగవంతుడు ఇచ్చిన గొప్పవరం బాల్యం. చిన్ననాటి రోజుల్లో చేసి అల్లరి, చిలిపి పనులు, సందడే వేరు. ఆ రోజులను తలుచుకున్నప్పుడల్లా ఓ మధురానుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ముఖ్యమైనది. అలాంటి బాలల దినోత్సవాన్ని(Children’s Day) మన దేశంలో November 14న జరుపుకుంటాం. నెహ్రూ జయంతి(Nehru Jayanti) రోజున ఈ చిల్డ్రన్స్ డే(Children’s Day) నిర్వహించుకుంటాం.
నెహ్రూను తలుచుకుని ప్రత్యేక కార్యక్రమాలు
చిల్డ్రెన్స్ డే(Children’s Day)కు నాంది భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ(India’s first Prime Minister was Jawaharlal Nehru). ఆయనకు పిల్లలన్నా(childrens), గులాబీ పువ్వులన్నా(Rose flowers) ఎంతో ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. అంతేకాదు స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ జీవితంలో అధిక భాగం జైల్లో(Jail)నే గడిపారు. ఆ సమయంలో తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని(Indira Priyadarshini)తో ఎక్కువకాలం గడపలేదు. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని ఆయన బలంగా నమ్మేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ(Children’s Film Society)ని ప్రారంభించారు.పిల్లల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఎంతో కృషి చేశారు.అందుకే ఆయన పుట్టిన రోజున బాలల పండుగగా నిర్వహిస్తారు.
ఏ దేశాల్లో ఎప్పుడు నిర్వహిస్తారంటే
పలు దేశాల్లో బాలల దినోత్సవాలు 1954వ సంవత్సరానికి ముందు భారతదేశంలో అక్టోబర్‌లో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి(United Nations) నిర్ణయం ప్రకారం మొదటిసారి 1954లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీని United Nations ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. Chainaలో జూన్1వ తేదీన, పాకిస్థాన్‌లో నవంబర్ 20వ తేదీన, Japanలో మే 5న, దక్షిణ కొరియా(South Korea)లో మే 5న, Polandలో జూన్ 1న, Srilankaలో అక్టోబర్ 1న ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.






