తిరుమల లడ్డూకు ఎందుకంత స్పెషల్ టేస్ట్? .. అసలు ఎలా తయారు చేస్తారు?

ManaEnadu:ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu COntrovery) గురించే చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు తేలింది. గత YSRCP సర్కార్ తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నెయ్యిని వినియోగించినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం (AP NDA Govt) ఆధారాలతో సహా నిరూపించింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే అసలు తిరుమల లడ్డూ అంటే ఎందుకంత ప్రత్యేకం? ఈ లడ్డూకు ఎందుకంత రుచి? అసలు ఈ లడ్డూను ఎలా తయారు చేస్తారు?

పేటెంట్ ఉన్న ఏకైక లడ్డూ

ఎవరైనా తెలిసిన వారు తిరుమల (Tirumala Temple)కు వెళ్తున్నామని చెబితే ఠక్కున మన నోటిలో నుంచి వచ్చే మాట.. వచ్చేటప్పుడు లడ్డూ తప్పకుండా తీసుకుని రండి. వీలైనన్ని ఎక్కువ తీసుకురండి. అని. తిరుమల లడ్డూ అంటే అంత ఇష్టం భక్తులకు. దేవుడిని నమ్మేవారే కాదు నమ్మనివారు కూడా ఈ లడ్డూ టేస్టుకు ఫిదాయే. అందుకే ఈ లడ్డూ అంత స్పెషల్. ప్రపంచంలో ఇతరులు ఎవరూ అనుకరించడానికి వీల్లేకుండా భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) ఉన్న ఏకైక ప్రసాదం తిరుమల లడ్డూ.

దిట్టం అంటే తెలుసా?

తిరుమల ఆలయం ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకూ లడ్డూ స్థానంలో ప్రసాదంగా వడ ఉండేది. బ్రిటీషు పాలనలో తిరుమల ఆలయ నిర్వహణను పర్యవేక్షించిన మహంతులు 19వ శతాబ్ది మధ్యలో ప్రసాదాల్లో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి ఆ తీపి బూందీ లడ్డూగా రూపాంతరం చెందింది. తిరుమల లడ్డూ (Tirumala Laddu Making)ల తయారీకి వినియోగించే వస్తువులు, సరకుల మోతాదును “దిట్టం” అంటారు.

1950లో దిట్టంను నిర్ణయించిన తిరుమల తిరుపతి పాలక మండలి.. భక్తుల రద్దీకి అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని TTD ఫాలో అవుతోంది. పడితరం దిట్టం స్కేలుగా పిలుచుకునే దీంట్లో.. పడి అంటే 51 వస్తువులు. 2001 దిట్టం స్కేలు ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరకులు వాడతారు. 803 కేజీల వివిధ రకాల సరకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు.

లడ్డూ తయారీలో వాడే పదార్థాలు

ఆవు నెయ్యి – 165 కిలోలు, శెనగపిండి -180 కిలోలు, చక్కెర (Sugar) – 400 కిలోలు, యాలకులు – 4 కిలోలు, ఎండు ద్రాక్ష – 16 కిలోలు, కలకండ – 8 కిలోలు, ముంతమామిడి పప్పు – 30 కిలోల సరకులు దిట్టంలో ఉంటాయి. ఇలా ఒక దిట్టం నుంచి సుమారు 5100 లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూ తయారీ పోటులో అత్యాధునిక వంట సామాగ్రిని వినియోగించి రోజూ లక్షల లడ్డూల (Tirumala Laddu News)ను తయారు చేస్తున్నారు. ఆగ్నేయంగా నిర్మించిన చోట తయారైన పోటు ప్రసాదాలను తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు నెలకొల్పిన శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *