
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ (Ramayana)’. డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని సుమారు $500 మిలియన్లు అంటే దాదాపు రూ.4000 కోట్లతో రూపొందిస్తున్నట్లు ఇటీవల నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ పాడ్‌కాస్ట్ (Podcast)లో వెల్లడించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా, సన్నీ డియోల్ (Sunny Deol) హనుమంతుడిగా నటిస్తున్నారు. హాలీవుడ్ (Hollywood) స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో సీత పాత్రపై మేకర్స్ ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.
సహజ అందమే బాగుంటుందనే ఉద్దేశంతో
ఈ క్రమంలో తాజాగా కీలక పాత్రలు పోషించిన రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor), సాయిపల్లవి (Sai Pallavi)ని తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని మేకర్స్ వెల్లడించారు. రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన గొప్పగా నటించే నైపుణ్యం, ప్రశాంతమైన వ్యక్తిత్వం అని తెలిపారు. అలాగే సీతా దేవిగా సాయిపల్లవిని తీసుకోవడానికి కారణం ఆమె గ్లామర్(Glamour పాత్రలకు దూరంగా ఉండటం, అందం కోసం సర్జరీలు చేయించుకోకపోవడం అని మేకర్స్ పేర్కొన్నారు. కృత్రిమం కన్నా సహజ అందమే బాగుంటుందనే సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ తెలిపింది.
ఇక, ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్(Glimpse) రామాయణపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది. అలాగే రెండో పార్ట్ 2027 దీపావళికి వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
#Ramayana glimpse Ft. Kalki Bgm pic.twitter.com/qn7bLoiBul
— Arthur (@Criticizerkf) July 5, 2025