మరో దారుణం.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య.. చివరకు?

భార్యల చేతిలో భర్తల చావులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో భర్తను భార్య హతమారుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కొందరైతే కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ముల్లో కుక్కేస్తున్నారు. ఇలాంటి గగుర్పొడిచే ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వేర్వేరుగా వివాహేతర సంబంధాలు

వేర్వేరుగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భార్యాభర్తలు 15 ఏళ్లుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నేళ్ల నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయినా సరే భర్త తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ తన భర్తను ఎలాగైనా మట్టుపెట్టాలని ప్లాన్ వేసింది. కొన్ని రోజులుగా ప్రణాళిక వేసి ఎట్టకేలకు హతమార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం తన చెల్లెలి సాయం తీసుకుంది. అలా భర్తకు ఓ రోజు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చింది. అనంతరం పూడ్చిపెట్టింది.

వివరాల్లోకి వెళ్తే

హైదరాబాద్ కేపీహెచ్బీకి చెందిన దంపతులు సాయిలు, కవిత పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత వేర్వేరు వ్యక్తులతో ఇద్దరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత ఇద్దరికి ఓ భయంకరమైన వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. వేర్వేరుగా ఉంటున్నా సరే.. సాయిలు తరచూ కవితను వేధిస్తూ ఉండేవాడు. దీంతో విసిగిపోయిన కవిత సాయిలు వేధింపుల నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని భావించింది.

అతడు చనిపోతేనే తనకు మనశ్శాంతి కలుగుతుందని భావించి చెల్లెలి భర్త సాయంతో సాయిల్ కు కరెంటు షాక్ పెట్టి చంపి పూడ్చిపెట్టింది. అయితే సొంతూరుకు వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు తిరిగి రాలేదని కవిత ఇరుగుపొరుకు చెప్పింది. దీంతో వారు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ శైలిలో విచారించగా కవిత అసలు విషయం చెప్పేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *