
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ (indoor) నుంచి మేఘాలయాకు హనీమూన్ కు వెళ్లిన జంట అదృశ్యం కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హనీమూన్ లో ఉండగానే భార్య, మరో ముగ్గురితో కలిసి చంపి లోయలో పడేసినట్లు తేలింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయారు. భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా.. భార్య మాత్రం కనిపించకుండా పోయింది. చివరకు రఘువంశీ భార్య సోనమ్ ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు.
అసలు ఎలా జరిగిందంటే..
మే 11న సోనమ్ తో రాజా రఘువంశీకి వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయాకు (megalaya) నవ దంపతులు వెళ్లారు. 22 తేదీన ఒక బైక్ అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడి ఫేమస్ ప్రాంతామైన ‘లివింగ్ రూట్ వంతెన’ చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి ఆచూకీ తెలియలేదు. కాగా 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ డెడ్ బాడీని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు. అతడి డెడ్ బాడీపై కత్తిపోట్లు ఉండటం, భార్య కనిపించకుండా పోవడంతో హత్యగా భావించి పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.
కాంట్రాక్ట్ కిల్లర్లతో సుపారీ..
ఈ క్రమంలో సోనమ్ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో (gajipur) పోలీసుల ఎదుట లొంగిపోయింది. మేఘాలయా డీజీపీ ఆమెను అరెస్టు చేసి విచారించగా భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి తన భర్త రఘువంశీని సోనమ్ చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రఘువంశీని చంపేందుకు భార్య సోనమ్ సుపారీ ఇచ్చినట్లు ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. కేసు విచారణ కొనసాగుతుందని మరిన్ని వివరాలు విచారణ అనంతరం చెబుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 7 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను మేఘాలయా సీఎం అభినందించారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది.
Missing #Indore woman Sonam Raghuvanshi, who is believed to have hired three men to kill her husband, found safe at a dhaba in #Ghazipur. She has undergone a medical examination, is currently being kept at a One Stop Center for safety and further inquiry. #MeghalayaTragedy pic.twitter.com/ClpQblB2sR
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 9, 2025