
ఈ కాలంలో టెక్నాలజీ మన జీవనశైలిలో ఒక భాగంగా మారిపోయింది. పనులు వేగంగా పూర్తవడం, సమాచారాన్ని చక్కగా మేనేజ్ చేయడం, తక్కువ సమయంతో మెరుగైన ఫలితాలు సాధించడం ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్లే సాధ్యమవుతున్నాయి.
అయితే ఈ టెక్నాలజీ మనకు సహాయంగా మారిందా లేక ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారిందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
మో గవ్డాట్ హెచ్చరికలు: ముందున్న 15 ఏళ్లు కష్టకాలమే!
గూగుల్ X సంస్థలో ఒకప్పుడు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మో గవ్డాట్, ఇటీవల ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన what-next అనే ప్రశ్నకు స్పందిస్తూ, “ముందు 15 సంవత్సరాలు మనమంతా చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఆ తర్వాతే మంచి పరిస్థుతులు వస్తాయి.” అని చెప్పారు. ఈ కష్టాలకు కారణం.. AI వల్ల లక్షల ఉద్యోగాలు పోవడం, సామాన్య ఉద్యోగులకే కాదు, సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయని గవ్డాట్ చెబుతున్నారు.
మూడుగురితో 300 మందిచే చేసే పని… ఇది AI పవర్!
మో గవ్డాట్ ప్రస్తుతం ఓ AI స్టార్టప్ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, “ఇదే పని కొన్నేళ్ల క్రితం అయితే 300 మంది డెవలపర్ల అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మేము ముగ్గురే అంతా చేస్తున్నాం,” అని తెలిపారు. ఇది AI వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు.
డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ కాదు.. CEO స్థాయి ఉద్యోగాలూ ప్రమాదంలో!
గవ్డాట్ ప్రకారం, డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ వంటి ఉద్యోగాలు మాత్రమే కాదు, AI భవిష్యత్తులో CEO స్థాయిలో పని చేయగలదు. అది మన కంటే బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని కూడా అన్నారు.
AI భవిష్యత్తుపై జెఫ్రీ హింటన్ కూడా హెచ్చరిక!
AI రంగంలో ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ కూడా ఒక సీరియస్ హెచ్చరిక చేశారు –
“AI ఒక దశలో వాళ్లకే అర్థమయ్యే భాషలో మాట్లాడటం ప్రారంభించవచ్చు. అప్పుడు మనం వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించలేము. నియంత్రించడమూ కష్టమే,” అని అన్నారు. ఇది భయపడించే మాటల్లా కనిపించినా, శాస్త్రీయంగా నిజమైపోతున్నదే అని ఆయన అభిప్రాయం. AI వల్ల మానవ జీవితాలు సులభతరమవుతున్నా, అదే టెక్నాలజీ మన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చబోతుందా అన్న అనుమానాలను నిపుణుల హెచ్చరికలు మేలుకొల్పుతున్నాయి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన రేపటి భద్రతను నిర్దేశిస్తాయి.