Mana Enadu : ఈనెల 4వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్ (Sandhya Theatre Fan Death) లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మూవీ పుష్ప-2 (Pushpa 2)ను ఫ్యాన్స్ తో చూసేందుకు బెన్ ఫిట్ షో కు రాగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun Arrest) ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసి రిమాండ్ రిపోర్టు తయారు చేస్తున్నారు.
మరోవైపు స్టేట్ మెంట్ సేకరించిన అనంతరం పోలీసులు బన్నీని ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదవ్వడంతో.. ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది.
అంతకుముందు అల్లు అర్జున్ పిటిషన్ (Allu Arjun Petition)ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టు (Telangana HC)ను ఆశ్రయించారు. బుధవారం రోజున పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. అత్యవసర పిటిషన్‌ను ఉదయం ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించగా.. క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికి తెచ్చామని న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు.
అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం.. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో కోర్టుకు సెలవులు ఉన్నందున అల్లు అర్జున్ (Allu Arjun Jailed) మూడ్రోజులు (ఇవాళ శుక్రవారంతో కలిపి) జైల్లోనే ఉండాల్సి వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.






