లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది. బార్బడోస్, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి అనేక కరేబియన్ దేశాలు కలిసి ఒక జట్టుగా ఆడతాయి. అయితే ఒలింపిక్స్ వంటి మల్టీ-స్పోర్ట్ ఈవెంట్‌లో ఒకే దేశానికి అవకాశం లభించే కారణంగా, (CWI) తమ ప్రత్యేకతను గుర్తించి, ఎవరు వెస్టిండీస్ తరఫున ఆడాలో తాము నిర్ణయించే హక్కును కోరుతోంది.
జమైకా లేదా బార్బడోస్ కు అవకాశం ఇవ్వండి
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) లాస్ ఏంజిల్స్ 2028 నిర్వాహకులు క్రికెట్ క్వాలిఫికేషన్ విధానాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఇది ర్యాంకింగ్స్ ద్వారా అవుతుందా, లేక క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లేదా వివిధ ఖండాల ప్రాతినిధ్యం ద్వారా జరుగుతుందా అనే విషయాలు ఇంకా తేలలేదు. (ICC) ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక జరిగితే, ప్రస్తుతం వెస్టిండీస్ పురుషుల జట్టు ఐసీసీ ర్యాంకింగ్ లో 5వ స్థానంలో ఉంది. దీంతో ‘వెస్టిండీస్’ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. కాబట్టి తమ వెస్టిండీస్ జట్టుకు తరఫున జమైకా లేదా బార్బడోస్ కు ఒలింపిక్స్ లో ఆడే అవకాశం ఇవ్వాలని క్రికెట్ వెస్డిండీస్ కోరుతోంది.
ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
(CWI) అధ్యక్షుడు డా. కిషోర్ షాలో మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో వెస్టిండీస్ దేశాలు ఎన్నో మెడల్స్ గెలిచి, ప్రపంచాన్ని అలరించాయి. ఇప్పుడు క్రికెట్‌కు కూడా ఆ అవకాశం లభించాలి. ఇది మా యువ ఆటగాళ్ల కల. ఒలింపిక్స్ లో న్యాయం, పారదర్శకత, ప్రాతినిధ్యం అనే అంశాలను పరిగణలోకి తీసుకుని మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యూకే విషయంలో కూడా ఇదే సమస్య ఉంది. అక్కడ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వేర్వేరు క్రికెట్ బోర్డులు ఉండటంతో, ఒలింపిక్స్‌లో ఎవరు ఆడాలి అన్న దానిపై స్పష్టత కొరవడింది. అయితే వెస్టిండీస్ 15 దేశాల సమాహారం కావడం, ఒలింపిక్స్ లో ఏదో ఒక దేశమే ఆడాల్సి రావడంతో ఇప్పుడు తల నొప్పిగా మారింది. జమైకా, బార్బడోస్ ను అనుమతించాలని కోరినప్పటికీ ఇవీ ఐసీసీలో ఒక సభ్యదేశంగా ఆడటం లేవు. ప్రాంతీయ జట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.






