ప్రస్తుతం రాజకీయాలపై సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కమల హాసన్(Kamal Hasan), దలపతి విజయ్, కుష్బూ, జయసుధ, జయప్రద, విశాల్(Vishal) తదితరులతోపాటు AP, తెలంగాణలో సీనియర్ నటి విజయశాంతి(Vijayashanti), మెగా హీరోలు పవన్ కళ్యాణ్, నాగబాబు(Nagababu), పోసాని కృష్ణమురళీ తదితరులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరు సినిమాలు, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా ఏపీలో నాగబాబు(Nagababu), తెలంగాణలో విజయశాంతి(Vijayashanti) ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మరి వీరికి మంత్రి పదవులు దక్కుతాయా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
రాములమ్మకు రేవంత్ సపోర్ట్ చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్(TG Congress)లో విజయశాంతికి క్యాబినెట్ స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఆమె BRSను ఎదుర్కొనే తీరుతెన్నులు, కాంగ్రెస్లో ఆమెకు ఉన్న అనుభవం, గులాబీ పార్టీకి ప్రతిస్పందించగల శక్తి వీటన్నింటిని పరిశీలిస్తే, ఆమెను మంత్రిగా నియమించేందుకు సీఎం రేవంత్(CM Revanth) ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఒకవేళ విజయశాంతికి మంత్రి పదవి దక్కితే ఒకరకంగా BRSకు పెద్ద షాక్ లాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆమెకు మంత్రిపదవి లభిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

నాగబాబుకు మంత్రి పదవి పక్కా..
ఇక ఏపీ సంగతికి వస్తే జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా, పవన్ సోదరుడిగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు నాగబాబు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ తన అన్నయ్య నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించి, క్యాబినెట్లో చోటు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.







