Border-Gavaskar Trophy 2024-25: యశస్వి సెంచరీ.. పలు రికార్డలు అతడి సొంతం

భారత యువ సెన్సేషన్​ యశస్వి జైస్వాల్​ మరోసారి అదరగొట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా తన దూకుడుతో వారిపై పైచేయి సాధించే యశస్వి బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీలో (Border-Gavaskar Trophy) ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్​లో డకౌట్​ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్​లో సెంచరీ చేశాడు. మరో 61 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ యువ బ్యాటర్​ కెరీర్​లో ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు పలు రికార్టులను తన పేరిట రాసుకున్నాడు.

యశస్వి సాధించిన ఘనతలివి..
* ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో బ్యాటర్​గా యశస్వి (Yashasvi Jaiswal) రికార్డు.

* ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్​ ఓపెనర్​గా మరో ఘనత. 22 ఏండ్ల 330 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు. యశస్వి కంటే ముందు కేఎల్​ రాహుల్​ (22 ఏళ్ల 263 రోజులు), జైసింహా (1967‌‌‌‌–78), సునీల్​ గవాస్కర్​ (1977–78) ఉన్నారు. వీరంతా రెండో ఇన్నింగ్స్ లోనే సెంచరీ బాదడం విశేషం.

* మొదటి 15 టెస్టుల్లో 1500+ రన్స్​ చేసిన తొలి బ్యాటర్​గా రికార్టు. ఇన్నింగ్స్​ పరంగా అత్యంత వేగంగా 1500+ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్​గా జైస్వాల్​ రికార్టు. అంతకుముందు పుజారా కూడా 28 ఇన్నింగ్స్​ల్లోనే ఈ మార్క్​ అందుకున్నాడు.

* భారత్​ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్​ యశస్వి.

* ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన ఇండియన్​ బ్యాటర్ కేఎల్​ రాహుల్​ (2014–15 సీజన్​లో). ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జైస్వాల్​ సెంచరీ బాదాడు.​

భారత్​ దూకుడు
బోర్డర్​–గవాస్కర్​ ట్రోపీని భారత్​ పేలవంగా ప్రారంభించినప్పటికీ.. ఆపై ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకన్న టీంమిండియా.. కేవలం 150 రన్స్​ చేసి ఆలౌట్​ అయ్యింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన ఆస్ట్రేలియా (Australia) బారత బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా, సిరాజ్​, హర్షిత రాణా దెబ్బకు ఆ జట్టు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 104 రన్స్​ చేసి ఆలౌట్​ అయ్యింది. రెండో ఇన్సింగ్​ ప్రారంభించిన టీంఇండియా భారీ ఆధిక్యాన్ని సాధించేలా దూసుకెళుతోంది. జైస్వాల్​ 161, కేఎల్​ రాహుల్​ 77 రన్స్​తో సత్తా చాటారు. ఇప్పటికే 350+ రన్స్​ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం క్రీజులో విరాట్​ కోహ్లీ, రిషభ్​ పంత్​ ఉన్నారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *