
ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YCP MP Mithun Reddy)ని సిట్(SIT) అధికారులు నేడు (జులై 19) అరెస్ట్ చేశారు. APలో కూటమి ప్రభుత్వం వచ్చాక, లిక్కర్ స్కాంపై దర్యాప్తు ఆరంభం కాగా, ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్(Arrest) తో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్టయింది. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. వివాదాస్పద మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది. ఈ మేరకు మిథున్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆయనను 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించడం కోసం అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సిట్ వర్గాలు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాయి.
ముందస్తు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు, సుప్రీంకోర్టు
అంతకుముందు మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. దాంతో ఆయన అరెస్ట్‌కు మార్గం సుగమమైంది. కాగా, లిక్కర్ స్కాంలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా వాసుదేవరెడ్డి, ఏ3గా సత్యప్రసాద్ ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ కేసులో ఏ5 అని తెలిసిందే. విజయసాయి ఈ కుంభకోణంలో తనను తాను విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్నప్పటికీ, ఈ కేసులో ఆయన పాత్రపై ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పొందుపరిచినట్టు తెలుస్తోంది.
మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం: విడుదల రజిని
ఇదిలా ఉండగా మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని, లేని లిక్కర్ కేసును సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. “మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నా. చంద్రబాబు గారూ… అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుపెట్టుకోండి” అంటూ రజిని ట్వీట్ చేశారు.
Special Investigation Team (SIT) arrested @YSRCParty MP PV Mithun Reddy on Saturday night, calling him a “core conspirator” in the alleged liquor scam and accusing him of using kickbacks to fund the 2024 elections.
The Rajampet MP was taken into custody after seven hours of… pic.twitter.com/npSOcSvPar
— SNV Sudhir (@sudhirjourno) July 19, 2025