Roshan: హిట్​ డైరెక్టర్​‌తో రోషన్​ సినిమా

‘హిట్‌’ సిరీస్లతో ఆకట్టుకున్న శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో శ్రీకాంత్‌ తనయుడు, యంగ్ హీరో రోషన్‌ (Roshan) నటించనున్నాడా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. నానీతో పూర్తిస్థాయి యాక్షన్ సినిమా‘హిట్ 3’తో విజయాన్ని అందుకున్నారు శైలేష్. ఆయన తీసిన హిట్, హిట్ 2తో పాటు వెంకటేశ్తో తెరకెక్కించిన సైంధవ్ కూడా యాక్షన్ మూవీనే. అయితే ఇప్పుడు ట్రాక్ మార్చి రోషన్‌తో ఓ ప్రేమ కథను రూపొందించనున్నట్లు బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు వినికిడి.

రెండు సినిమాలతో బిజీగా ఉన్న రోషన్

ఇక ప్రస్తుతం రోషన్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కిస్తున్న ‘ఛాంపియన్‌’ (Champion)లో నటిస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. దీనితోపాటు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘వృషభ’లోనూ రోషన్‌ నటిస్తున్నారు. ఈ మూవీని నంద కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *