Mirai: ‘మిరాయ్’ లేటేస్ట్ అప్డేట్.. మళ్లీ వాయిదా పడ్డ తేజాసజ్జ మూవీ

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘మిరాయ్(Mirai)’ మరోసారి వాయిదా పడింది. యువ నటుడు తేజా సజ్జ(Teja Sajja) హీరోగా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా(Postpone) పడుతూ ఆడియన్స్‌ను నిరుత్సాహపరుస్తుంది. ఇక షూటింగ్ పనులు పూర్తి కాగా.. ఎట్టకేలకు ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అనుష్క మూవీ అడ్డురావడంతోనే..

అదే రోజున అనుష్క (Anushka) ఘాటీ(Ghaati) సినిమా రిలీజ్ ఉండటంతో.. మిరాయ్‌ని వాయిదా వెయ్యాలని ఫిక్స్ అయ్యారట మూవీ టీమ్. ఈ మేరకు సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాను వాయిదా వేస్తూ.. సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్(Manchu Manoj) విలన్‌గా మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్(TG Vishwaprasad) గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *