యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు చిత్రం ‘వర్జిన్ బాయ్స్(Virgin Boys)’ ఓటీటీలోకి వచ్చేసింది. గీతానంద్(Geetanand), మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దయానంద్ గడ్డం(Dayanand Gaddam) దర్శకత్వం వహించారు. రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దారపునేని(Raja Darapuneni) నిర్మించిన ఈ సినిమా జులై 11న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది.‘వర్జిన్ బాయ్స్’ కథలో ఆర్య (గీతానంద్), డుండీ (శ్రీహాన్), రోనీ (రోనిత్) అనే ముగ్గురు బీటెక్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ వర్జినిటీ కోల్పోవాలనే ఛాలెంజ్‌ను స్వీకరిస్తారు. ఈ క్రమంలో సరయు (మిత్రా శర్మ), లైలా (జెన్నీఫర్ ఇమాన్యుయల్), శ్లోక (అన్షులా ధావన్)లతో వీరి ప్రేమ కథలు మొదలవుతాయి.

ఆకట్టుకునేలా డబుల్ మీనింగ్ డైలాగులు
ఇక ఈ మూవీలో యూత్‌ను ఆకట్టుకునే డబుల్ మీనింగ్ డైలాగులు, గ్లామర్ సన్నివేశాలతో ఈ చిత్రం అడల్ట్ కామెడీ జోనర్(Adult comedy genre)లో ఆకట్టుకుంది. అయితే, చివర్లో ప్రేమ యొక్క నిజమైన విలువను తెలియజేసే సందేశంతో ముగుస్తుంది. స్మరణ్ సాయి(Smaran Sai) సంగీతం, వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. థియేటర్లలో విడుదలైనప్పుడు ‘టికెట్ కొట్టు-ఐఫోన్ పట్టు’, ‘మనీ రైన్’ వంటి వినూత్న ప్రమోషన్‌లతో ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది. యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అదే ఉత్సాహాన్ని అందించనుంది.






