2025 ఛాంపియన్ ట్రోపీ (Champions Trophy) పాకిస్థాన్ లో జరగుతుండగా.. దీనికి భారత క్రికెటర్లను పంపించేది లేదని బీసీసీఐ (BCCI)తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా హైబ్రిడ్ మోడల్ లో ఆడేందుకు అంగీకరించింది. కానీ పాకిస్థాన్ మాత్రం దీనికి ఒప్పుకునేది లేదని మొదట్లో వాదించింది. ఆ తర్వాత బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఐసీసీ కూడా ఓకే చెప్పాల్సి వచ్చింది.
ఆటగాళ్ల రక్షణే ప్రాధాన్యం
అయితే టీం ఇండియాను పాకిస్థాన్ పంపకపోవడం మంచిదని మాజీ భారత క్రికెటర్ 2007 టీ 20 వరల్డ్ కప్ లో సభ్యుడు ఎంపీ యూసుప్ పఠాన్ ( Yusuf Pathan) అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎప్పుడు భారత క్రికెటర్ల బాగోగులు చూసుకుంటుంది. వారి కుటుంబం, వారి ఆరోగ్యం ఇలా అన్ని రకాల బాగోగులు చూసుకుంటుంది. ముందు ఆటగాళ్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. పాకిస్థాన్ పంపకపోవడం వెనక భద్రతా కారణాలు ఉన్నాయి. కాబట్టి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఐసీసీ నిర్ణయమే ఫైనల్
ఛాంపియన్స్ ట్రోఫీ అంశంపై ఇప్పటికే ఐసీసీ ( ICC) మడు సార్లు సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకుని వాయిదా పడింది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఐసీసీకి ఓకే చెప్పినా ఒక మెలిక పెట్టిందని తెలుస్తోంది. ఇక నుంచి పాకిస్థాన్ భారత్ మ్యాచ్ ఏదీ జరిగినా అది హైబ్రిడ్ మోడల్ లోనే జరిగేలా చూడాలని కోరుతుంది. దీనిపై ఐసీసీ ఓకే చెప్పినా బీసీసీఐ నుంచి సమాధానం రావాల్సి ఉంది. అయితే బీసీసీఐ పెద్దలకు కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఇవాళ జరగబోయే ఐసీసీ సమావేశంలో అధ్యక్షుడు జైషా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
కానీ భారత మాజీ క్రికెటర్లు మాత్రం పాకిస్థాన్ డిమాండ్లకు అంగీకరించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై మాజీ భారత క్రికెటర్ హర్బజన్ సింగ్ ( Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ టీం ఇండియా కు వచ్చినా రాకపోయిన నష్టమేమీ లేదని అన్నాడు. అది వారి ఇష్టమని అన్నారు. తాజాగా యూసుప్ పఠాన్ కూడా బీసీసీఐ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.