ధనశ్రీతో విడాకులు.. తొలిసారి నోరు విప్పిన చాహల్

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanshree Varma) విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ పుకార్లు మొదలైనా.. తాజాగా ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యూజీ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది. ఇక ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

నిజం కావచ్చు.. కాకపోవచ్చు

ఈ నేపథ్యంలో చాహల్ (Chahal Girl Friend) మరో అమ్మాయితో కనిపించడం.. ధనశ్రీ గతంలో ఓ కొరియోగ్రాఫర్ తో సన్నిహితంగా దిగిన ఫొటోను మళ్లీ బయటకు తీసి పలువురు నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ధనశ్రీ (Dhanashree Trolls) తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది. ఇక తాజా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చాహల్ తొలిసారిగా తన విడాకుల పుకార్లపై స్పందించాడు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు, కాకపోవచ్చంటూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చీ ఇవ్వనట్లుగా ఓ పోస్టు పెట్టాడు.

నేను అర్థం చేసుకోగలను

“అభిమానుల మద్దతు లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. ఫాన్స్ ప్రేమకు ధన్యవాదాలు. అయితే ఈ ప్రయాణం ఓవర్‌కి ఎంతో దూరంలో ఉంది. నా దేశం, జట్టు, అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్‌ మిగిలే ఉన్నాయి. ఓ కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నా. ఇటీవల నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటా. సోషల్‌ మీడియాలో వస్తున్న న్యూస్ నాకు తెలిసింది. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరిని కోరుతున్నా’” అని చాహల్‌ పోస్ట్ చేశాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *