
సోషల్ మీడియా(Social Media) వైరల్ అయేందుకు కొందరు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. లైకులు, షేర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ మోజులో ఏకంగా రైలు పట్టాలపైనే కారు నడిపి(Driving a Car on TrainTracks) తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో చోటుచేసుకుంది. ఆమె నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలు(Train Movements) నిలిచిపోయాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్‌పల్లి(Nagulapalli-Shankarpalli) రైల్వే మార్గంలో ఓ యువతి తన కారును రైలు పట్టాలపై నడుపుతూ కనిపించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు రీల్స్(Reels) చిత్రీకరించేందుకే ఆమె ఈ ప్రమాదకరమైన పనికి పాల్పడినట్లు తెలిసింది.
ఎవరినీ ఏమాత్రం లెక్కచేయకుండా..
రైలు పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న కారును గమనించిన రైల్వే సిబ్బంది(Railway staff) వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, యువతి వారిని ఏమాత్రం లెక్కచేయకుండా కారును ముందుకు పోనిచ్చింది. కొంత దూరం వెళ్లాక, నాగులపల్లి వద్ద కొందరు స్థానికులు ఆమె కారును అడ్డుకోగలిగారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తన వద్ద ఉన్న చాకును తీసి వారిని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉద్యోగం పోవడటంతో డిప్రెషన
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె ఉత్తరప్రదేశ్‌లో లక్నోకి చెందిన బబితా సోనీగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం పోవడంతో యువతి డిప్రెషన్‌కు వెళ్లి ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
#woman drives car on railway track towards Hyderabad. The incident was reported near #shankarpally .
Despite the railway staff attempted to stop her, she speeds off the car on the track.As a precaution Railway officials halted #Bengaluru–#Hyderabad #trains . pic.twitter.com/bBbCywZlou
— DINESH SHARMA (@medineshsharma) June 26, 2025