యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌లో హీరో ఎవరంటే?

Mana Enadu :  బాలీవుడ్ ది, క్రికెట్ ది విడదీయరాని బంధం. ఇప్పటికే పలువురి క్రికెటర్ల జీవిత కథలు తెరకెక్కాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపాయి. అలా వచ్చిన వాటిలో మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ ఒకటి. ‘ఎంఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ (MS Dhoni The Untold Story)’ అంటూ వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇక  త్వరలోనే మరో క్రికెటర్ బయోపిక్ కూడా రాబోతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ రూపొందనుంది.

టీ సిరీస్ బ్యానర్ లో యువీ బయోపిక్

Bhushan Kumar, along with Ravi Bhagchandka, is all set to bring the extraordinary life of Yuvraj Singh to the big screen with an upcoming biopic. This film promises to be a grand celebration of Yuvraj’s remarkable journey in cricket and his incredible contributions to the sport. Here's taking a look at actors who would be perfect to play the cricketer on-screen.

క్రికెట్‌ వరల్డ్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన యువరాజ్ తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించాడు. అలాంటి ఓ ప్రేరణ కలిగించే వ్యక్తి కథను ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో టి-సిరీస్‌ యువరాజ్ సింగ్ బయోపిక్ (Yuvraj Singh Biopic)ను రూపొందించాలని నిర్ణయించింది. టీ-సిరీస్ బ్యానర్ లో బాలీవుడ్‌ నిర్మాతలు భూషణ్‌ కుమార్, రవి భగ్‌ చందక్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యువీగా సిద్ధాంత్

ఆగస్టులో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో, క్రికెట్ ఫ్యాన్స్ లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ యంగ్ హీరో చేసిన కామెంట్స్ తో యువీ బయోపిక్‌పై మళ్లీ చర్చ జరుగుతోంది. అతడెవరో కాదు సిద్ధాంత్‌ చతుర్వేది(Siddhant Chaturvedi).

Siddhant Chaturvedi: Yuvraj Singh himself expressed his desire for Siddhant Chaturvedi to be cast as the former Indian cricketer in his biopic.

ఇన్ స్టా పోస్టుతో మరోసారి చర్చ

ఇటీవల ఓ నెటిజన్.. ఏ డ్రీమ్‌ రోల్‌, ఛాలెంజ్‌ విసిరే పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు? అని ఇన్ స్టా చిట్‌చాట్‌లో అడగగా..  యువరాజ్‌ (Yuvaraj Singh Siddhant Movie) ఫొటోతో ఆన్సర్ ఇచ్చాడు సిద్ధాంత్. దీంతో యువీ బయోపిక్ లో ఈ యంగ్ హీరో తెరపై కనిపించబోతున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఇక సిద్ధాంత్‌.. ‘గల్లీబాయ్‌’, ‘ఫోన్‌ భూత్‌’, ‘యుధ్రా’, గెహరాయియా, కో గయే హమ్ వంటి సినిమాలతో సందడి చేశాడు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *