టాలీవుడ్, కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Actor Siddharth) పరిచయం అక్కర్లేని పేరు. బాయ్స్, యువ, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు. గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ కాస్త జోరు ప్రదర్శిస్తున్నాడు.
షాకింగ్ న్యూస్ చెప్పిన సిద్ధార్థ్
ఇటీవలే ‘చిన్నా (Chinna)’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా అటు కోలీవుడ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి హిట్ సాధించింది. ఇక సిద్ధార్థ్ తన వైఖరితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. సోషల్ మీడియాలో పోస్టులతో తరచూ వివాదాస్పదమవుతుంటాడు. ఇటీవలే ఈ హీరో బాలీవుడ్ బ్యూటీ అతిదీ రావు హైదరీని (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ముంబయిలోనే మకాం పెట్టాడు.
నాదో అరుదైన వ్యాధి
తాజాగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని అంటూ షాకింగ్ విషయం చెప్పాడు సిద్ధార్థ్ (Siddharth PTSD). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉంది ఉందని.. అది అభిమానుల వల్లే వచ్చిందంటూ సంచలన కామెంట్స్ చేశాడు. చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ట్ డమ్ కోసం పాకులాడుతూ ఉంటారని.. తాను కూడా అలాగే చేశానని చెప్పాడు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత తన అభిమానుల వల్ల తాను ఓ వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు.
వారి వల్లే నాకు ఆ వ్యాధి
చాలా మంది హీరోలు స్టార్ డమ్ వస్తే ఎంజాయ్ చేస్తారు. కానీ నేను మాత్రం ఎంజాయ్ చేయాల్సిన టైం లో ఇబ్బందులు పడ్డాను. చాలా మంది ఫ్యాన్స్ నన్ను ఫాలో చేస్తూ నాతో మాట్లాడటానికి చాలా ఆసక్తి చూపించేవారు. కానీ నాకు వారితో మాట్లాడాలంటే చాలా టెనషన్ గా అనిపించేంది. అలా ఎందుకు జరుగుతుందోనని నేను వైద్యులను సంప్రదించాను. అప్పుడు వారు చెప్పిందేంటంటే.. నాకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ (Post Traumatic Stress Disorder) అనే వ్యాధి ఉందని. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది’ అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.






