ఇందుకూరి సునీల్ వర్మ.. అలియాస్ సునీల్(Sunil).. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ నటుడి గురించి తెలియని వారంటూ ఉండరు. కామెడియన్(Comedian)గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్.. ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ రోల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలినాళ్లలో డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్న ఆయన ఆ తర్వాత దానికి భిన్నంగా వివిధ పాత్రలలో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించాడు. వాస్తవానికి సునీల్ సినీ కెరీర్ 1996లో ప్రారంభం కావాల్సింది కానీ పలు కారణాల వల్ల 2000లో వచ్చిన ‘నువ్వే కావాలి(Nuvve Kavali)’ సినిమా ద్వారా కామెడియన్‌గా తెరంగేట్రం చేశాడు.
![]()
గతేడాది ఏకంగా 11 సినిమాల్లో నటించాడు..
ఆ తర్వాత అందాల రాముడు(Andala Ramudu), మర్యాద రామన్న(Maryada Rammanna), పూల రంగడు, తడాఖా సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఆ తర్వాత అతడు హీరోగా సెట్ కాలేదు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సునీల్ కలర్ ఫొటో, పుష్ప ది రైజ్, పుష్ప-2 ది రూల్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. నటుడిగా సునీల్ మళ్లీ బిజీ అయిన సంగతి తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. ఓవైపు సీరియస్ పాత్రలు పోషిస్తూనే కామెడీ రోల్లోనూ నవ్వులు పూయిస్తున్నాడు. ఇక గత ఏడాది ఏకంగా 11 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడీ నటుడు.

దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్ మూవీలో..
ఇక ఈ ఏడాదిలోనూ భారీ సినిమాల్లో సినిల్ సందడి చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే సునీల్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పాత్రలతోనూ తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా.. దళపతి విజయ్(Thalapathi Vijay) హీరోగా కోలీవుడ్‌లో వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్(Jana Nayagan)’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో చేస్తోన్న తొలి పొలిటికల్ చిత్రమిది. ఈ చిత్రంలో సునీల్ ప్రతినాయకుడి(Villain Role)గా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే తమిళ్లో వచ్చిన ‘జైలర్(Jailer)’ సినిమాతో పేరు తెచ్చుకున్న సునీల్.. విజయ్ సినిమాలోనూ అదే జోరు కొనసాగిస్తాడని కోలీవుడ్(Kollywood)లో ఓ న్యూస్ వైరలవుతోంది.
https://www.youtube.com/watch?v=YhAOYqfuyHs






